కంపెనీలో వాటా ఇస్తారా అంటూ సీఈవోను నిలదీసిన యువ ఉద్యోగి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

నిర్ణీత వేళలకే పని చేయాలని, ఓనర్లా ఆలోచించాలన్న సీఈవో వ్యాఖ్యలపై ఓ జెన్-జీ ఉద్యోగి తీవ్రంగా స్పందించినట్లు సోషల్ మీడియా యూజర్ మారియో పీటీ వెల్లడించారు. తనకు యాజమాన్యంలో యాభై శాతం వాటా ఇస్తారా అని ఆ ఉద్యోగి ఎదురు ప్రశ్నించినట్లు తెలిపారు. ఉదయం తొమ్మిదింటికి వచ్చి సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకే ఇంటికి వెళ్లే ఆ ఉద్యోగితో జరిగిన ఈ సంభాషణ నెట్టింట తీవ్ర చర్చకు దారితీసిందని పేర్కొన్నారు.