రేపు సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
రేపు సాయంత్రం 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నారు. శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులపై జరిగిన దాడి ఘటనపై గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేయనున్నారు. అలాగే డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఈ భేటీలో జగన్ కోరనున్నట్లు సమాచారం.