ఢిల్లీలో రిషి సునాక్ సందడి: ప్రసిద్ధ దుకాణంలో భారతీయ వంటకాలు ఆస్వాదించిన మాజీ ప్రధాని

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఢిల్లీ

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని ప్రసిద్ధ బెంగాలీ స్వీట్ హౌస్ను సందర్శించినట్లు యజమాని వర్జేష్ అగర్వాల్ వెల్లడించారు. అత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, ఎంపీ స్వాతి మలివాల్తో కలిసి ఆయన అక్కడకు వచ్చి చాట్ వంటకాలు, కేసర్ లడ్డూలు ఆస్వాదించారని తెలిపారు. గతంలోనూ ఆయన ఈ దుకాణాన్ని సందర్శించారని, ఈసారి ప్రత్యేకంగా మసలా చాయ్ కూడా కోరడంతో యజమాని భార్య దానిని సిద్ధం చేసి అందించారని ఆయన పేర్కొన్నారు.