అమెరికాలో ఘనంగా హిందీ దివస్ వేడుకలు: ఉపాధ్యాయులను సత్కరించిన కాన్సుల్ జనరల్
రిపోర్టర్: శివ
స్థలం: లాస్ఎంజెల్స్
అమెరికాలోని లాస్ఎంజెల్స్లో భారత కాన్సులేట్ కార్యాలయంలో హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాస తెలిపారు. కాన్సులేట్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తరతరాలుగా సమాజాలను అనుసంధానించే హిందీ భాష ప్రాముఖ్యతను ఈ వేడుకలు చాటాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. హిందీ భాషా వ్యాప్తికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.