తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: వాస్తవిక పరిష్కారాలు కావాలని పిలుపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: సూర్యాపేట
తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై వాస్తవిక పరిష్కారాలు అవసరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మేలు జరిగేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రాజెక్టుల ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.