'డ్రగ్స్‌పై పోరాడుదాం.. రేపటి సమాజాన్ని నిర్మిద్దాం': అల్లూరి జిల్లా పోలీసుల పిలుపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Alluri Sitarama Raju District
మాదకద్రవ్యాల మహమ్మారిపై అందరూ కలిసికట్టుగా పోరాడాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తును, సమాజాన్ని కాపాడుకోవడానికి డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని కోరారు. పిల్లల ఆర్థిక లావాదేవీలను తరచూ పరిశీలిస్తూ, భావితరం డ్రగ్స్‌కు బానిస కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.