కూటమి నాయకుల సమక్షంలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కోట జంక్షన్ వద్ద ఆశీర్వాద దీపాలు వెలిగించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో విలసిల్లాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అధితి గజపతి రాజు, బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, తెలుగుదేశం నాయకులు కరణం సూర్యతేజ, కంది మురళీనాయుడు పాల్గొన్నారు.