దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత: ఐదు వందలకు పైగా ఆందోళనకారులు అదుపు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు యత్నించిన ఐదు వందలకు పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్ తో తలపెట్టిన ఈ ఆందోళన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించామని, ఎటువంటి అనుమతులు లేని నిరసనలను సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.