మున్సిపల్ పోలింగ్ బరిలో ఖాకీల పహారాతో మోగిన ఎన్నికల నగారా

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 1న 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 4,372 పోలింగ్ కేంద్రాల్లో 36,351 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. వీటిలో 671 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నవంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.