తాండూరులో కలకలం: రైల్వే క్వార్టర్స్ సమీపంలో కత్తిపోట్లతో యువకుడు మృతి
రిపోర్టర్: విజయ్
స్థలం: వికారాబాద్
తాండూరు రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఆటో డ్రైవర్ మున్వర్ కత్తిపోట్లతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడి కడుపులో లోతైన గాయాలు ఉన్నట్లు గుర్తించామని, అతడు స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తాండూరు సీఐ పరమేశ్వర్ తెలిపారు. పరారీలో ఉన్న స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారని, అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.