పరిషత్ ఎన్నికల్ లో ఉద్రిక్తత: పోలింగ్ కేంద్రాలపై దాడులు, బ్యాలెట్ పెట్టెల ధ్వంసం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కడప
రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికలు పలు ప్రాంతాల్ లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయని, వైఎస్సార్ కడప మరియు అనంతపురం జిల్లాల్ లో పోలింగ్ కేంద్రాలపై దాడులు జరగడంతో పాటు బ్యాలెట్ పెట్టెలను ధ్వంసం చేశారని ఈనాడు, న్యూస్టుడే యంత్రాంగం వెల్లడించింది. పులివెందుల మండలం ఎర్రిపల్లెలో వైకాపా శ్రేణులు పెట్రోలు బాంబులు విసరగా, అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల గ్రామంలో పోలింగ్ కేంద్రంలోకి చొరబడిన ఆందోళనకారులు బ్యాలెట్ పెట్టెను బయటకు తీసుకెళ్లి పత్రాలను చెల్లాచెదురుగా పడేశారని అధికారులు తెలిపారు.