గ్రామాల అభివృద్ధి లక్ష్యం: ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఎల్లారెడ్డి
జిల్లాలోని గ్రామాలను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు స్వచ్ఛందంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. లింగంపేట మండలం లింగంపల్లి గ్రామంలో ఆయన బుధవారం పర్యటించి, అక్కడ జరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు చేస్తున్న విశేష కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.