పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత: వైకాపా ఏజెంట్లను అడ్డుకున్నారంటూ జగన్ ధర్నా
రిపోర్టర్: సునీల్
స్థలం: పులివెందుల
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ఏజెంట్లను పోలింగ్ బూత్ లలోకి అనుమతించలేదని ఆరోపిస్తూ మాజీ సీఎం జగన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తెదేపా అక్రమాలకు పాల్పడుతోందని విమర్శిస్తూ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.