క్షమాపణ చెప్పేది లేదంటూ సతీష్ సాటియన్‌కు ఆదిత్య థాకరే తేల్చిచెప్పారు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ముంబై
దిశ సాటియన్ తండ్రి పంపిన ఐదు వందల కోట్ల పరువు నష్టం నోటీసులపై శివసేన యూబీటీ నేత ఆదిత్య థాకరే స్పందించారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన సోషల్ మీడియా పోస్టులలో ఎక్కడా సతీష్ సాటియన్ పేరు ప్రస్తావించలేదని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఈ విషాదాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు స్వతంత్రంగా జరగాలని ఆదిత్య తరపు న్యాయవాది పేర్కొన్నారు.