సీఎంఆర్ఎఫ్ ద్వారా నూట నలభై రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
ఆమదాలవలస నియోజకవర్గంలో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. ఎమ్మెల్యే కూన రవికుమార్ చొరవతో ఒకేసారి నూట నలభై రెండు కుటుంబాలకు రూ.37 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఈ సాయం ఎంతో భరోసా ఇస్తోందని, నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు ఏడు వందల కుటుంబాలకు పది కోట్ల రూపాయల వరకు సహాయం అందించినట్లు ఆయన తెలిపారు.