కామారెడ్డిలో చెత్త కుప్పపై కౌన్సిలర్ నిరసన: మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: హరి
స్థలం: కామారెడ్డి
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో కామారెడ్డి పాత పట్టణ ప్రాంతం చెత్త డంపింగ్ యార్డులా మారిందని 46, 47 వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా లక్ష్మీనారాయణ చెత్తలో కూర్చుని నిరసన తెలిపారు. కమిషనర్ షిఫ్ట్ మార్పుల వల్ల పారిశుధ్యం పూర్తిగా క్షీణించిందని, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో చెత్త కుప్పలు పేరుకుపోయి రోగులు తీవ్ర దుర్గంధం మధ్య అనారోగ్యాల బారిన పడుతున్నారని వారు మండిపడ్డారు.