పులివెందులలో ఎన్నికలే జరగవంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Kadapa

పులివెందులలో అధికార కూటమి పెద్దఎత్తున అరాచకాలకు, రిగ్గింగ్ కు పాల్పడుతోందని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తాను పిలుపునిస్తే రాష్ట్రంలో ఎన్నికలే జరగవని, కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే సంయమనం పాటిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన స్థానిక సంస్థల పోలింగ్ సరళిపై విలేకరులతో మాట్లాడుతూ వైకాపా ఏజెంట్లను అడ్డుకుంటున్నారని, పోలింగ్ కేంద్రాలను తెదేపా ఆక్రమించిందని తీవ్ర ఆరోపణలు చేశారు.