స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు: వైఎస్ షర్మిల కీలక ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయవాడ

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు సీనియర్ నాయకులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వేదికగా జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని ఇన్ఛార్జ్లను ఆదేశించారు.