కింగ్ 100 చిత్రంలో మహంతి ఝాన్సీ రాణిగా టబు: అంచనాలు పెంచుతున్న గ్లింప్స్

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

అక్కినేని నాగార్జున వందో సినిమా కింగ్ 100లో ప్రముఖ నటి టబు మహంతి ఝాన్సీ రాణి అనే శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగ్ సరసన టబు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నటిస్తుండటంతో ప్రేక్షకుల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.