బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ తనపై చేసిన విమర్శలపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
సినీ పరిశ్రమలో తాను 48 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మెగా ఫాన్స్ యూత్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి తనపై వస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో స్పందించారు. తన బ్లడ్ బ్యాంక్ పై కొందరు పనిగట్టుకుని రక్తం అమ్ముకుంటున్నారంటూ దుష్ప్రచారం చేశారని, అలాంటి మూర్ఖపు విమర్శలను తాను ఎప్పుడూ పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. చెయ్యి చాచి ఎవరి వద్ద డొనేషన్స్ తీసుకోకుండా తన కష్టార్జితం, అభిమానుల సహకారంతోనే బ్లడ్ బ్యాంక్ ను నిర్వహిస్తున్నట్లు చిరంజీవి స్పష్టం చేశారు.