మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు: ఇవి సెలక్షన్లేనంటూ ఫైర్

రిపోర్టర్: రాము స్థలం: తాడేపల్లి

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ లో కూటమి పార్టీల విజయంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ, ఎన్నికల సంఘం కుమ్మక్కై ప్రతిపక్షానికి అవకాశం లేకుండా చేశాయని ఆయన ఆరోపించారు. ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు కాదని, కేవలం సెలక్షన్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. దేశంలో తక్షణమే ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు.