కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని విచారించిన సీబీఐ అధికారులు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయవాడ

సాయికృష్ణ కస్టడీ మృతి కేసుకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని సీబీఐ అధికారులు తీవ్రంగా విచారించారు. స్టేషన్లో సాయికృష్ణకు చికిత్స అందించిన వైనంపై ఆరా తీసినట్లు అధికారులు తెలిపారు. సీఐ నాగరాజు ఆదేశాలతోనే ఆర్ఎంపీని పిలిపించినట్లు బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ దర్కాబాబు వెల్లడించారు. ఈ కేసులో సీబీఐ మొత్తం పదకొండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆధారాల కోసం ఫోరెన్సిక్ బృందంతో కలిసి లోతైన దర్యాప్తును వేగవంతం చేసింది.