ఎండిన పంటలను చూసి కన్నీటి పర్యంతమైన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలన్న విజిత్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: లక్సెట్టిపేట
లక్షెట్టిపేట మండలంలో సాగునీరు అందక పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావ్ డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బలరావుపేట గ్రామ శివారులో దెబ్బతిన్న వరి పంటలను ఆయన పరిశీలించి, నీరందక అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.