'వినాయక నిమజ్జనంలో విషాదం': కుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Sangareddy
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శిరీష అనాథాశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి దుర్మరణం చెందారు. నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుని ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.