సన్న బియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు: మంత్రి తుమ్మల హెచ్చరిక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఖమ్మం

ప్రభుత్వం పేదలకు అందించే సన్న బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, రేషన్ కార్డులు రద్దు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఇళ్ల కేటాయింపులో పక్షపాతం చూపే సర్పంచ్‌లు పదవులు కోల్పోతారని స్పష్టం చేశారు. పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, రైతులు పామాయిల్ సాగును ప్రోత్సహించాలని ఆయన కోరారు. అర్హులైన పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.