సోషల్ మీడియాలో భారత్ ప్రతిష్టపై జపాన్ యువతి సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: సతీష్ స్థలం: ముంబై

భారత్ పై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని జపాన్ కంటెంట్ క్రియేటర్ హికారు తీవ్రంగా ఖండించారు. ముంబైలో ఎనిమిది నెలలుగా నివసిస్తున్న ఆమె, కేవలం ప్రతికూల అంశాల ఆధారంగా దేశాన్ని అంచనా వేయరాదని స్పష్టం చేశారు. వ్యర్థాల సమస్య ప్రతి దేశంలోనూ ఉంటుందని, భారత్ లోని అద్భుతమైన సంస్కృతిని, ఆహారాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని కోరుకుంటున్నట్లు హికారు పేర్కొన్నారు.