విదేశీ వైద్య విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టు షాక్, పరీక్షకు అనర్హులు
రిపోర్టర్: సురేష్
స్థలం: India
విదేశాల్లో విడివిడిగా చదువు పూర్తి చేసిన వైద్య విద్యార్థులు FMGE పరీక్షకు హాజరు కావడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వైద్య విద్య ప్రమాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, ఇలాంటి విచ్ఛిన్నమైన విద్య దేశ ఆరోగ్య వ్యవస్థకు ప్రమాదకరమని కోర్టు పేర్కొంది. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, విద్యార్థుల పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. వైద్య విద్యలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.