అచ్చంపేటలో ఉపాధి కల్పనపై ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రత్యేక సమీక్ష

రిపోర్టర్: వెంకట్ స్థలం: అచ్చంపేట

వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు గ్రామాల్లో ఉపాధి కల్పించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్పష్టం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఇబ్బంది పడకుండా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గ్రామాల వారీగా పనులను గుర్తించి వెంటనే ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు.