విశాఖలో విషాదం.. పుట్టినరోజు నాడే రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విశాఖపట్నం
విశాఖ ఎన్ఏడీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదన్ అనే యువకుడు మృతి చెందాడు. తోపుడుబండి వ్యాపారం చేసే తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ, ఈవెంట్స్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మదన్ అకాల మరణం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇటీవల కొనుగోలు చేసిన సొంతింటి ఈఎంఐ భారాన్ని మోస్తున్న మదన్, తన పుట్టినరోజు నాడే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం కన్నీటిని తెప్పిస్తోంది. కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు.