ఎస్ఏటీ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచిన తెలుగు మూలాలున్న విద్యార్థి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: గుంటూరు

అమెరికాలో నిర్వహించిన ఎస్ఏటీ పరీక్షలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పద్నాలుగేళ్ల తెలుగు విద్యార్థి ఆశ్రిత్ తల్లూరి నూటికి నూరు శాతం మార్కులు సాధించి చరిత్ర సృష్టించాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. మ్యాథమెటిక్స్, రీడింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పదహారు వందలకు పదహారు వందల స్కోరు సాధించినట్లు వారు వెల్లడించారు. ఈ అరుదైన విజయం సాధించడం పట్ల స్థానికంగా ఉన్న ప్రముఖులు ఆశ్రిత్ తల్లూరిని ప్రత్యేకంగా అభినందించారని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.