చేయూత పింఛన్ దరఖాస్తులో కీలక మార్పులు: సర్టిఫికెట్లు లేకున్నా అప్లై చేయొచ్చు

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ దరఖాస్తు ప్రక్రియలో కీలక సడలింపులు ఇచ్చింది. ఇకపై ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఆదాయ, కుల, సదరం సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాథమిక వివరాలతో దరఖాస్తు పూర్తి చేయవచ్చు. క్షేత్రస్థాయి విచారణకు అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఒరిజినల్ పత్రాలను చూపిస్తే సరిపోతుంది. సర్టిఫికెట్ల జాప్యంతో ఇబ్బంది పడుతున్న అర్హులకు ఇది పెద్ద ఊరట.