నేను చస్తే బిల్లులిస్తారా: సొంత ప్రభుత్వంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: రాము స్థలం: మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజాపూర్ మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి బిల్లుల విడుదల కోసం ముప్పై వేల మందితో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు చెల్లిస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంట్రాక్టర్ చనిపోతే ఐదు కోట్లు ఇచ్చారని, తన నియోజకవర్గ నిధుల కోసం తనే చస్తేనే బిల్లులు ఇస్తారా అని అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.