విషాదం: ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ కెల్కర్ కెల్లీ కన్నుమూత

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Missouri

అమెరికా టెలివిజన్ రంగంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు రాబర్ట్ కెల్కర్ కెల్లీ తన అరవై రెండేళ్ల వయసులో తుదిశ్వాస విడిచారని వైద్య అధికారులు మరియు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మిస్సోరిలోని తన స్వగృహంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయన్ను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని అధికారులు స్పష్టం చేశారు. డెయస్ ఆఫ్ అవర్ లైవ్స్ సీరియల్తో అత్యంత ఆదరణ పొందారు.