బాలాపూర్ గణనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణపతి ఉత్సవాల్లో కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉత్సవ నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.