గృహ నిర్వహణ పదము లింగ బేధ రహితమని తెలిపిన హైకోర్టు

రిపోర్టర్: సతీష్ స్థలం: చెన్నై

గృహ నిర్వహణ అనేది కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని, ఆ పదం పూర్తిగా లింగ బేధ రహితమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. కుటుంబం కోసం సంపాదించడం ఎంత ముఖ్యమో, ఇంట గృహ జీవితాన్ని చక్కదిద్దడం కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటుందని జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ ఎం.డి. సుమతి ధర్మాసనం అభిప్రాయపడింది. ఇళ్లలో ఉండే గృహిణులతో పాటు గృహ భర్తలు కూడా ఉండవచ్చని న్యాయస్థానం పేర్కొన్నట్లు న్యాయ నిపుణులు తెలిపారు.