విజయవాడ పున్నమి ఘాట్లో సరస్ మేళా 2026 ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: ఎన్టీఆర్
విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న సరస్ మేళా 2026 సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా వెల్లడించారు. ఈనెల 31వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్త సంప్రదాయ హస్తకళలు, చేనేత వస్త్రాలు, విభిన్న ప్రాంతీయ రుచులు ఒకే వేదికపై కొలువుదీరాయని తెలిపారు. జాతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఈ గొప్ప వేడుకను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.