మురసు తుపాను విలయం: ఫ్రంట్లైన్ సిబ్బంది సేవలను కొనియాడిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

మురసు తుపాను ఉధృతి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ సిబ్బంది ధైర్యసాహసాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, అత్యవసర సేవల్ లో శ్రమిస్తున్న ఫ్రంట్లైన్ హీరోలకు ప్రత్యేకంగా సలాం చేశారు. రాష్ట్రంలో రహదారుల పునరుద్ధరణ, విద్యుత్ సరఫరా మరియు సహాయక చర్యల కోసం వేలాది మంది సిబ్బందిని రంగంలోకి దించినట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.