విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరన్నవరాత్రి ఉత్సవాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: ఎన్టీఆర్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయని కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా వెల్లడించారు. అమ్మవారి పవిత్ర దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.