వడ్డెర కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వం వడ్డెర కులస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పదహారు జిల్లాల్లో ముప్పై రెండు ప్రాంతాలను గుర్తించి నూరు హెక్టార్ల భూమిని క్వారీ పూల్స్ కోసం కేటాయించింది. రిజిస్టర్డ్ సహకార సంఘాలకు ఈ లీజులు కేటాయించనున్నారు. సీనరేజ్ ఫీజులో యాభై శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వడ్డెర కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.