ఏలూరులో కాలేజీల వద్ద డ్రోన్లతో విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక నిఘా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఏలూరు

ఏలూరులో కాలేజీలు విడిచిపెట్టే సమయంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు Eluru Police వెల్లడించారు. విద్యార్థినుల భద్రతను కాపాడేందుకు అధునాతన డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నిఘాతో పాటు శక్తి టీమ్ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యతనిచ్చి అసాధారణ కదలికలపై గట్టి నిఘా ఉంచామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.