'ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విమర్శలు': హరీశ్ రావు ఫైర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా 9,200కు పైగా అక్రమ లావాదేవీలు జరిగాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తానీరు హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరిట 308 ఎకరాల భూమి ఉందని, బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను వారి భూముల గుండా మార్చుకోవడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని మండిపడ్డారు. భూభారతి అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.