రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ దాడి చేస్తోందంటూ బీజేపీ నేత నితిన్ నబిన్ ధ్వజం
రిపోర్టర్: శివ
స్థలం: హరియాణా
ఎన్నికల్ లో ఓటమి నైరాశ్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సంస్థలపై దాడులు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరియాణాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, వంశపారంపర్య పాలనను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. విదేశీ శక్తుల ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని, ఓటర్లకంటే చొరబాటుదారులపైనే ఆ పార్టీకి ఎక్కువ నమ్మకం ఉందని నితిన్ నబిన్ ధ్వజమెత్తారు.