ఢిల్లీ జంతర్‌మంతర్ ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం: మహిళలపై దాడులు ఖండార్హం
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళలపై పోలీసుల తీరును కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi తీవ్రంగా తప్పుబట్టారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న మహిళలను బలవంతంగా అదుపులోకి తీసుకోవడం, మహిళా జేఈఈ జర్నలిస్టులపై పోలీసులు దాడులు చేసి కెమెరాలు లాక్కోవడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి అణచివేత చర్యలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.