న్యూఢిల్లీలో మోదీ, పుతిన్ కీలక సమావేశం ప్రారంభం
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య గంటన్నర పాటు సుదీర్ఘంగా కీలక సమావేశం జరిగింది. రక్షణ రంగం, ఇంధన భద్రత, వాణిజ్యంపై చర్చించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు ఒకే కారులో భారత్ మండపానికి వెళ్లి ఇన్నోప్రామ్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు.