తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
రిపోర్టర్: సతీష్
స్థలం: తిరుచానూరు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్ర ప్రతిష్టా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే కడప జిల్లాలోని ప్రసిద్ధ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనూ వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.