పరిషత్ ఎన్నికల విధులకు 14 వేల మంది ఉపాధ్యాయులకు ముమ్మర శిక్షణ
రిపోర్టర్: SKLM NEWS
స్థలం: లావేరు
నవంబర్ 3న జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు జిల్లాలో 14 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి వి. విశ్వేశ్వరరావు లావేరులో తెలిపారు. సోమవారం లావేరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణను ఆయన పరిశీలించారు.