ప్యాపిలి మండలంలో కురిసిన భారీ వర్షంతో పొంగిపొర్లిన వాగులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ప్యాపిలి
ప్యాపిలి పట్టణంతో పాటు గుడిపాడు, పోతుదొడ్డి తదితర గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో ఇదే పెద్ద వర్షం అని చెప్పవచ్చు. దీనితో స్థానిక రైతులు ఎండిపోయిన పంటల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.