అన్న క్యాంటీన్లలో ప్రైవేట్ హోటళ్లను తలపించేలా ఆత్మీయ అతిథి మర్యాదలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లను ఇకపై ప్రైవేట్ హోటళ్లను తలపించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. క్యాంటీన్లకు వచ్చే ప్రతి ఒక్కరినీ సిబ్బంది ఆత్మీయ పలకరింపుతో ఆహ్వానించడంతో పాటు శుచి, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న సిబ్బందికి మెప్మా ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, లబ్ధిదారుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నామని విజయనగరం మెప్మా డీఆర్పీ బి.శ్రీనివాసరావు వెల్లడించారు.