స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి

రిపోర్టర్: రాము స్థలం: Vizianagaram

విజయనగరం జిల్లా రణస్థలంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన కూటమి నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతోందని ఎంపీ పేర్కొన్నారు.