'ఉగ్రమూలాలను వేళ్లతో సహా ఏరిపారేస్తాం': లష్కర్‌ కమాండర్‌ సైఫుల్లాపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

రిపోర్టర్: సతీష్ స్థలం: జమ్ము కశ్మీర్

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్థాన్‌కు చెందిన లష్కర్‌-ఇ-తొయిబా కమాండర్‌ సైఫుల్లా కసూరిపై జమ్ములోని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌ఐఏ, ఈ కీలక పరిణామాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్‌లోని కసూర్‌ జిల్లాకు చెందిన సైఫుల్లా వివిధ పేర్లతో సరిహద్దు అవతలి నుంచి ఉగ్రకలాపాలను నిర్వహిస్తూ భద్రతా దళాలకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారాడు.